AP TET 2024 : ఏపీ టెట్-2024 ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు పూర్తి.. ఈ తేదీల్లో ప‌రీక్ష‌లు

పల్నాడు జిల్లా పరిధిలో ఏపీ టెట్‌–2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు.

నరసరావుపేట: పల్నాడు జిల్లా పరిధిలో ఏపీ టెట్‌–2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్‌ పరీక్షకు 9,556 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెక్షన్లుగా నిర్వహించబడతాయని వివరించారు. పరీక్షల నిర్వహణకు నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

కోటప్పకొండ రోడ్డులోని నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల, నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల అటానమస్‌ బ్లాక్‌–4, ఏ.ఎం.రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల, పెట్లూరివారిపాలెం, ఎంఏఎం మహిళా ఇంజనీరింగ్‌ కళాశాల కేసానుపల్లి పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈఓ కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

NMMS Exam : ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తుల తేదీ పొడ‌గింపు..

అభ్యర్థులు ఉదయం ఏడు నుంచి రాత్రి 10 గంటల వరకు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తికి కార్యాలయ సిబ్బంది కె.ప్రసాదబాబు 9704494654, వై.తిరుపతిరావు 9177020977, జి.జీవరత్నం 9866904960, పి.శంకరరాజు 9963192487 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags