APTET Hall Tickets Released: ఏపీటెట్‌ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా

టీచర్‌ ఎలిజిబిలిటి టెస్ట్‌(APTET) 2024 హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలివే:

పరీక్ష తేది: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు
ప్రాథమిక కీ విడుదల: మార్చి 10 
అభ్యంతరాల స్వీకరణ: మార్చి 11 వరకు
తుది కీ: మార్చి 13న విడుదల
టెట్‌ ఫలితాల ప్రకటన: మార్చి 14

టెట్‌ పరీక్ష  అర్హత మార్కులు:
ఏపీ టెట్‌ను పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు. పేపర్‌–1ఎ, పేపర్‌–1బిలను అయిదు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్‌లో.. అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో, బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.

టెట్‌ పరీక్ష విధానం: 
సీబీటీ (Computer Based Test)ఆధారంగా పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 9:30 నిమిషాల నుంచి 12గంటల వరకు మొదటి సెషన్‌, 2:30 నుంచి 5గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 185 సెంటర్స్‌తో పాటు హైదరాబాద్‌, చెన్నై బెంగళూరు, బరంపురంలో ఎగ్జామ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. 


APTET 2024 పరీక్షకు హాజరయ్యే వాళ్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది
1. హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. దీంతో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌.. ఇలా ఏదోఘొక గుర్తింపు కార్డును కూడా తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. 
2. హల్‌ టికెట్‌పై ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి
3. సెల్‌ఫోన్స్‌, వాచ్‌.. ఇలా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లినా సెక్యూరిటీ పాయింట్‌ వద్ద ఇవ్వాలి. 
4. హాల్‌టికెట్‌ను ముందుగానే డౌన్‌లోడ్‌ చేసుకొని పెట్టుకోండి. 

APTET 2024 హాల్‌టికెట్లను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://aptet.apcfss.in/ను క్లిక్‌ చేయండి
2. హోమ్‌ పేజీలో APTET 2024 హాల్‌ టికెట్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేయండి. 
3. లాగిన్‌ కోసం పుట్టిన తేదీతో పాటు హాల్‌ టికెట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి. 
4. హాల్‌ టికెన్‌ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

 

#Tags