Polycet 2024 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Polycet 2024 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది జూన్‌ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం 1వ ర్యాంకు నుంచి 12 వేల ర్యాంకు వరకు ఆ కళాశాల ప్రిన్సిపల్‌, కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ వై.ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఈ కౌన్సెలింగ్‌ మొత్తం 78 మంది విద్యార్థులు హాజరై సర్టిఫికెట్లను పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం 12,001వ ర్యాంకు నుంచి 27 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. అసిస్టెంట్‌ కో–ఆర్డినేటర్‌ ఎస్‌.సుధీర్‌రెడ్డి, చీఫ్‌ వెరిఫికేషన్‌ ఆఫీసర్‌ ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ ఎస్వీ.గౌరీశంకర్‌, పాల్గొన్నారు.

#Tags