Jobs at 108 Service: 108లో ఉద్యోగాలకు దరఖాస్తులు
అనంతపురం మెడికల్: 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జీఎన్‌ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెన్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈఎంటీ పోస్టుకు, పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 ఏళ్లలోపు వయసు కల్గి ఉన్న వారు డ్రైవర్‌కు అర్హులని తెలిపారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల 19వతేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
#Tags