AP Inter Advanced Supplementary: ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌కు గైర్హాజ‌రైన విద్యార్థులు..

ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఇంట‌ర్మీడియ‌ట్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల్లో శ‌నివారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో హాజ‌రైన, గైర్హాజ‌రైన విద్యార్థుల సంఖ్య‌ను వివ‌రించారు అధికారులు..

తిరుపతి: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఇంగ్లిష్‌ పరీక్షకు 733 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ. ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఉదయం నిర్వహించిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు జనరల్‌, ఒకేషనల్‌లో కలిపి 13,046 మంది హాజరవ్వాల్సి ఉండగా వారిలో 660 మంది, మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షకు జనరల్‌, ఒకేషనల్‌లో కలిపి 614 మంది హాజరవ్వాల్సి ఉండగా వారిలో 73 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా సోమవారం ఉదయం ఇంటర్‌ ప్రథమ, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్‌, బోటనీ, సివిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుందని ఆర్‌ఐఓ పేర్కొన్నారు.

POLYCET Counselling 2024: పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్‌..

#Tags