Exam Fees: టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఫీజు
టెన్త్, ఇంటర్ సబ్జెక్టులలో తప్పిన విద్యార్థులకు మళ్ళీ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ, వారి సబ్జెక్టుకు ఫీజు ప్రకటించిన తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
సాక్షి ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఒకసారి తప్పిన వారికి 2024 ఏప్రిల్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు పెదబరడ ప్రభుత్వ బాలుర పాఠశాల కో–ఆర్డినేటర్ కె.బాలన్న తెలిపారు. పదో తరగతికి ఒక్కో సబ్జెక్టుకు రూ.100లు, ఇంటర్మీడియెట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150లు, ప్రాక్టికల్ ఒక్కో సబ్జెక్టుకు రూ.100లు ఫీజు అక్టోబర్ 15లోగా ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9491606710, 8332936703, 9491902984 నంబర్లుకు సంప్రదించాలని ఆయన తెలిపారు.
Lecturer Posts: ఈనెల 22లోగా గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు
#Tags