Dussehra Holidays: జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు.. తేదీలు ఇవే..

నెల్లూరు(టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలకు అక్టోబ‌ర్ 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు ఆర్జేడీ వీవీ సుబ్బారావు అక్టోబ‌ర్ 17న‌ తెలిపారు.
జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు.. తేదీలు ఇవే..

ఆయన పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలను సందర్శించి రాజకీయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా కళాశాలల్లో రాజకీయ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఏ కళాశాలలోను ఇలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం గాని, ప్రోత్సహించడంగాని చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

చదవండి:

School Holidays: ఈ సారి దీపావళి సెలవు పొయినట్టే..

Dussehra Holidays: కాలేజీలకు దసరా సెలవులు ప్ర‌క‌టించిన‌ యూనివర్సిటీ

#Tags