Intermediate Exams: మార్చి 1 నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ‍మొదలు..

శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షల గురించి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఒక ప్రకటనలో మాట్లాడారు. విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు..

అనకాపల్లి: ఈ ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలకు జిల్లాలో 28,621 మంది విద్యార్థులు హాజరవుతారని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి (డీఐఈవో) బి.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో అన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8 గంటలకు చేరుకోవాలని ఆమె పేర్కొన్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

Eamcet Results: ఎంసెట్‌ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 29, పట్టణ ప్రాంతాల్లో 9 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 10,704 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,619 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 12,708 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,590 మంది పరీక్షలు రాస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని సౌకర్యలు కల్పిస్తామని, పరీక్షలు సీపీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Intermediate Exams 2024: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

#Tags