AP Inter Supplementary Results : ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం సప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో టాప్‌లో నిలిచిన జిల్లా ఇదే..

ఇంట‌ర్మీడియ‌ట్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా టాప్‌లో నిలిచింది. ఈ సంద‌ర్భంగా విద్యార్థులను అభినందించారు..

పార్వతీపురం: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్టు జిల్లా వృత్తి విద్యాధికారిని మంజులా వీణ తెలిపారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో 1709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 1443 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు.

IT Jobs: ఐటీలో కోతల కాలం!.. రిక్రూట్‌ చేసుకున్నా ఆఫర్‌ లెటర్‌ ఇవ్వడం లేదు..

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ప్రత్యేక తరగుతులు నిర్వహించిన అధ్యాపకులకు ఆమె అభినందనలు తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆమె కోరారు. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించడంలో విశేష కృషిచేసిన జిల్లా వృత్తి విద్యాధికారికి పార్వతీపురం మన్యం జిల్లా జూనియర్‌ కళాశాల సిబ్బంది అభినందనలు తెలిపారు.

Mega Job Mela : విజయనగరంలో మెగా జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే

#Tags