Gurukul Junior College Admissions: 31లోగా గురుకుల కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు
కంకిపాడు: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. గురుకులాల్లో 2024–25 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్ (ఆంగ్ల మాథ్యమం) మొదటి సంవత్సరం ప్రవేశానికి గుంటూరు కేంద్రంగా ఉన్న ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31 తుదిగడువుగా నిర్ణయించారు. ఇందుకు గానూ ఏపీ ఆర్‌జేసీ సెట్–2024 నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Gurukuls admissions : గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిమ్మకూరు ఏపీఆర్‌జేసీ
రాష్ట్ర వ్యాప్తంగా పది జూనియర్ గురుకుల కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి నిమ్మకూరు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల జూనియర్ కళాశాల (సహ విద్య) ఉంది. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యనభ్యసించిన విద్యార్థులు ఏపీఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా https://aprs.apcfss.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
DSC 2024 Updates : వీరికి ఈ సారి డీఎస్సీకి చాన్స్ లేనట్టే.. కారణం ఇదే..!
దరఖాస్తులు చేసుకున్న వారికి ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హత సాధించిన విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో చేరేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పది గురుకుల కళాశాలల్లో 1,149 సీట్లు ఉన్నాయి. కృష్ణాజిల్లా నిమ్మకూరు కేంద్రంగా నిర్వహిస్తున్న ఏపీఆర్‌జేసీకి 195 సీట్లు కేటాయించారు.
TNPSC 2024 : గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల....
ఇక్కడ విద్యనభ్యసించేందుకు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సీట్ల భర్తీ విషయంలో అర్హులైన బాలురు లేని పక్షంలో ఆ సీట్లు బాలికలకు కేటాయించనున్నారు.
Course Training: మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
ఎంపిక విధానం
ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వే షన్, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
పరీక్ష విధానం
ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ విధానంలో ఉంటుంది. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసే కోర్సులు ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నాపత్రం తెలుగు/ఇంగ్లిషు/ఉర్దూ మాధ్యమాల్లో ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి.
Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?
సీట్ల కేటాయింపు ఇలా...
ఓసీ–38 శాతం, బీసీ (ఏ)–7 శాతం, బీసీ (బీ)–10 శాతం, బీసీ (సీ)–1 శాతం, బీసీ(డీ)–7 శాతం, బీసీ(ఈ)–4 శాతం, ఎస్సీ,–15 శాతం, ఎస్టీ–6 శాతం, దివ్యాంగులు–3 శాతం, క్రీడలు– 3 శాతం, అనాథలు– 3 శాతం, ఆర్మీ– 3 శాతంగా నిర్ణయించారు. ఈ రిజర్వేషన్ల కేటగిరీ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు.
Telangana Gurukulam Jobs 2024 : తెలంగాణ గురుకుల పోస్టులన్ని ఈ ఆధారంగానే భర్తీ చేయండి..
సద్వినియోగం చేసుకోవాలి
ఈ విద్యాసంవత్సరం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏపీఆర్‌జేసీకి అర్హులు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అభ్యసించేందుకు ఇదొక చక్కటి అవకాశం. ఈ నెల 31తో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. విద్యార్థులు త్వర పడి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న విజయవాడ, మచిలీపట్నంలో జరుగుతుంది.
– తాహెరా సుల్తానా, డీఈఓ, కృష్ణాజిల్లా
TS GENCO 2024 Exams Postponed: ఏఈ, కెమిస్ట్ పరీక్షలు వాయిదా... కొత్త తేదీ...