AP Entrance Exams: ఏపీలో ప‌లు ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌... ఐసెట్ ఎప్పుడంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఈఏపీసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌), లేటరల్‌ ఎంట్రీ (డిప్లమా విద్యార్థులు ఇంజనీరింగ్‌ రెండో ఏడాదిలో ప్రవేశం)కి సంబంధించిన ఈసెట్, ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్‌ నోటిఫికేషన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు, పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయించింది.

చ‌ద‌వండి: నీట్‌ (యూజీ) నోటిఫికేషన్ విడుద‌ల‌... ఇలా అప్లై చేసుకోండి
మే 15న ఈఏపీసెట్‌
ఈ మేరకు షెడ్యూల్‌ వివరాలను ఉన్నత విద్యా మండలి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్‌.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈఏపీసెట్‌ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్‌ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు అవకాశం కల్పించింది. మే 24, 25న ఐసెట్‌ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.. దరఖాస్తుకు మార్చి 20 నుంచి ఏప్రిల్‌ 19 వరకు గడువు నిర్ణ‌యించింది.

చ‌ద‌వండి: ఏపీ పాలీసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

#Tags