AP TET 2024 Key and Results 2024 : ఏపీ టెట్-2024 'కీ' విడుదల.. రిజల్డ్స్ తేదీ ఇదే...!
షెడ్యూల్ ప్రకారం అయితే టెట్-2024 ఫైనల్ కీ ని అక్టోబర్ 27వ తేదీన విడుదల చేయాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టెట్-2024 ఫైనల్ కీ విడుదల అక్టోబర్ 29 తేదీన విడుదల చేశారు.
☛➤ AP TET 2024 Final Key కోసం క్లిక్ చేయండి
టెట్ ఫలితాల విడుదలపై కూడా.. ఆందోళన..?
టెట్-2024 ఫలితాలను కూడా షెడ్యూల్ ప్రకారం అయితే నవంబర్ 2వ తేదీన విడుదల చేయాల్సింది ఉంది. అయితే దీనిపైన కూడా విద్యాశాఖ అధికారులు ఎటువంటి క్లారీటీ ఇవ్వలేదు. దీంతో డీఎస్సీ-2024కి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి టెట్‌కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే...?
ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే మెగా డిఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ టెట్ 2024 ఫలితాలు విడుదలైన మరుసరటి రోజే అనగా నవంబర్ 3వ తేదీన మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ సారి డీఎస్సీ-2024 ద్వారా 16347 ప్రభుత్వ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 31 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే విధంగా డీఎస్సీ సిలబస్ పై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యధావిధిగా పాత సిలబస్‌ను కొనసాగించడానికి నిర్ణయించింది.