AP DSC Exam 2024 and TET Results Postponed News : ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలు వాయిదా.. కారణం ఇదే..! మళ్లీ పరీక్షలను..?
ఎన్నికలు కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీన 6100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే.
మరో వైపు టెట్ పరీక్ష 2024 ఫలితాలు కూడా..
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తరువాత ఒకేసారి టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసి డీఎస్సీ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏపీ డీఎస్సీ పరీక్షలు, టెట్ పరీక్ష ఫలితాలకు ఎన్నికలు అడ్డుపడ్డాయి. ఓ వైపు టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావల్సి ఉన్నాయి. మరో వైపు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ డీఎస్సీ 2024 పరీక్షలు జరగాల్సి ఉన్నాయి.
మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కమీషన్ అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాయడం, అనుమతి రావడంలో ఆలస్యం జరగడంతో ఇక పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఎన్నికల కమీషన్ అనుమతి లభించిన తరువాతే కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారమే..
పరీక్ష కేంద్రాల ఎంపిక కూడా కొత్త షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల తరువాత డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలంటూ వేయికి పైగా ఫిర్యాదులు వచ్చాయని అన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపిన విషయం తెల్సిందే. ఎన్నికల కమీషన్ నుంచి క్లారిటీ రాకపోవడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఏపీ విద్యాశాఖ.
☛ DSC 2024 Updates : వీరికి ఈ సారి డీఎస్సీకి చాన్స్ లేనట్టే.. కారణం ఇదే..!
ముఖ్యంగా టేట్, డీఎస్సీ పరీక్ష మధ్య కొద్దిగైన గ్యాప్ ఉండాలన్న హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇదివరకు ఒకసారి పరీక్ష షెడ్యూల్ మార్చడం జరిగింది. మరోసారి ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ వాయిదా పడింది.
ఏపీ డీఎస్సీ-2024 పరీక్షలకు, ఏపీ టెట్-2024 ఫలితాలకు ఈసీ బ్రేక్..
ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ నేపథ్యంలో.. ఎన్నికల కమిషన్ కూడా ఏపీ డీఎస్సీ -2024 పరీక్షలను వాయిదా వేసింది. ఎన్నికల తర్వాత నిర్వహించుకోవచ్చుని తెలిపింది. అలాగే ఏపీ టెట్-2024 ఫలితాలకు కూడా ఈసీ బ్రేక్ వేసింది. ఎన్నిక తర్వాతే.. ఏపీ టెట్-2024 ఫలితాలు విడుదల చేయనున్నారు.