AP DSC and TET Notification Details 2024 : నేడే టెట్‌-2024 నోటిఫికేష‌న్‌.. అలాగే డీఎస్సీ కూడా..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (TET)-2024 నోటిఫికేష‌న్‌ను ఏపీ విద్యాశాఖ జూలై 1వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ది.

ఈ టెట్‌కు సంబంధించిన‌ దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ మొద‌లైన‌ పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ జూలై 2వ తేదీన (మంగళవారం) cse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పాఠశాల విద్యాశాఖ  శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్ తెలిపారు. అలాగే ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటుచేశామన్నారు.

☛ AP DSC-2024 స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆగ‌స్టులో టెట్ ప‌రీక్ష‌..?
జూలై 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. జూలై 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్‌-2024 నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టెట్‌కు డీఎస్సీకి మధ్య దాదాపు 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే ఏపీ డీఎస్సీ-2024 పూర్తి నోటిఫికేష‌న్‌ను వారం రోజుల్లో విడుద‌ల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న విష‌యం తెల్సిందే.

☛ AP TET 2024 Syllabus Details : ఏపీ టెట్‌-2024 పూర్తి సిల‌బ‌స్ ఇదే.. మంచి మార్కులు సాధించాలంటే ఇవే కీలకం..

SGT - Bitbank : 

TRT/DSC Methodology : 

School Assistant  Bitbank :

#Tags