6100 AP DSC Jobs 2024 Notification : బ్రేకింగ్ న్యూస్‌.. 6100 పోస్టుల‌కు డీఎస్సీ-2024 నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. 6100 ప్ర‌భుత్వ‌ టీచ‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 6100 ప్ర‌భుత టీచ‌ర్ ఉద్యోగాలకు రెండు రోజుల్లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో జ‌న‌వ‌రి 31వ తేదీన‌ మంత్రి వర్గ సమావేశం జరిగింది. పలు ఇతర కీలక అంశాలపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఏపీ కేబినెట్ భేటీలోని కీల‌క అంశాలు ఇవే..
☛ కేబినెట్ లో డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చ
☛ టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం.
☛ 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ఆమోదం.
☛ యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపు
☛ వైఎస్సార్‌ చేయూత నాలుగో విడతకు ఆమోదం.
☛ ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం
☛ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం.
☛ ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్.
☛ ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం.

#Tags