AP Open school Results 2024:ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఫలితాలను సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 8 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరు కాగా, 9,531 మంది (63.30 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
Also Read: ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
ఇంటర్మిడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ చూడవచ్చని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వర్‌రావు తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.200, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.