AP 10th Class Results Live Updates 2024 : ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల విడుద‌ల‌పై కీల‌క స‌మాచారం.. ఈ తేదీనే రిజల్ట్స్ వ‌స్తున్నాయ్‌..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎట్ట‌కేల‌క ఏఈ టెన్త్ ఫ‌లితాల విడుద‌లకు లైన్‌క్లియ‌ర్ అయింది. ఇప్ప‌టికే టెన్త్‌ జవాబుపత్రాల వేల్యూయేషన్ ప్ర‌క్రియ ముగిసింది. ఈ సారి టెన్త్ ఫ‌లితాల విడుద‌ల‌కు దాదాపు క‌సర‌త్తు పూర్తైంది. ఈ సారి పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు.

వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్‌ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసి.. అత్యంత త్వ‌ర‌గానే వేల్యూయేషన్ పూర్తి చేశారు. మరోసారి జవాబు పత్రాలు పునఃపరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 

ఏప్రిల్ చివ‌రి వారంలోనే..?

ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఒకటి రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన తేదీపై స్పష్టం రానుంది. ఏపీ పదో తరగతి ఫలితాలు ఈ నెల చివరి వారంలో అంటే ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీలోపు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. ఒకే ఒక్క క్లిక్‌తో అత్యంత త్వ‌రగా ఏపీ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. దీంతో పాటు వెంట‌నే పదో తరగతి మార్కుల మెమోను కూడా విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

How to Check AP Tenth Class Results 2024..?

☛ ఏపీ టెన్త్ ప‌బ్లిక్ పరీక్ష రాసిన విద్యార్థులు www.sakshieducation.com లోకి వెళ్లాలి.
☛ sakshieducation హోమ్ పేజీలో కనిపించే AP SSC Result 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.మీ హాల్ టికెట్ నంబర్ ని నమోదు చేయాలి.
☛ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే.. మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
☛ ప్రింట్ లేదా డౌన్‌లోడ్‌ ఆప్షన్ పై నొక్కి మార్క్స్ మెమో కాపీని పొందవచ్చు.

☛ Best Course of Intermediate : 'ఇంటర్‌'లో ఏ గ్రూపులో జాయిన్ అయితే.. బెస్ట్ కెరీర్ ఉంటుందంటే..?

కానీ ఈసారి చూస్తే..

ఈ సారి ఏపీ పదో తరగతి ఫలితాలు ముందుగానే రానున్నాయి. గత ఏడాది షెడ్యూల్ చూస్తే.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. 18వ తేదీ వరకు కొనసాగాయి. మే 6వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూస్తే..  2024 మార్చి 18వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభమైన.. మార్చి 30వ తేదీతోనే ముగిసాయి. దీంతో ఈసారి పదో తరగతి ఫలితాలు తొందరగానే రానున్నాయి. అన్ని కుదిరితే.. ఏప్రిల్ చివ‌రి వారంలోనే టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తామంటున్నారు బోర్డ్ అధికారులు.

విద్యార్థుల కోసం ఈసారి కొత్త విధానం..
ప‌దో ప‌రీక్ష పేప‌ర్ల‌ మూల్యాంకనంలో.. విద్యార్థుల‌కు ఏమైనా అనుమానాలు ఉంటే.. నివృత్తి చేసుకోవాలనుకుంటే.. ఈ సారి ఆన్‌లైన్‌ విధానం తీసుకొచ్చారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌ లింక్‌ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాం­కనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు.

#Tags