Ap 10th Class Results 2024 Break Records: ఏపీ పదో తరగతి ఫలితాల్లో రికార్డుల మోత, గతంలో ఎన్నడూ లేనంతగా..
![Ap 10th Class Results 2024 Break Records](/sites/default/files/images/2024/04/23/10th-cls-1713867514.jpg)
ఏపీలో ఈ ఏడాది విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు రికార్డుల మోత మోగించారు. గతంలో ఎన్నడూ లేనంతగా చాలా మంది విద్యార్థులు టాప్ స్కోర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 86.69శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఫలితాల్లో ఎక్కువగా బాలికలు పైచేయి సాధించారు. బాలురి ఉత్తీర్ణత శాతం 84.21శాతం నమోదు కాగా, బాలికలు 89.17% ఉత్తీర్ణత సాధించారు.
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈసారి పదో తరగతి ఫలితాల్లో దాదాపు 1400 మందికి 590, ఆపైన మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇంత మందికి 590 మార్కులు రాలేదు. 18,000 మంది 570+ మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కూళ్లలో 104 మందికి 590పైగా మార్కులు వచ్చాయి. ఇక అన్నమయ్య జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినికి 597 మార్కులు వచ్చాయి.
![girls score top in 10th results](/sites/default/files/inline-images/girls_1.jpg)
స్టేట్ టాపర్.. ఒక్క మార్కు మాత్రమే తక్కువ
ఇక రాష్ట్ర స్థాయిలో నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే అమ్మాయి ఎవరు ఊహించని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసి.. స్టేట్ టాపర్‌గా నిలిచింది. సెకండ్ లాంగ్వేజ్ హిందీలో మాత్రం 99 మార్కులు సాధించింది. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలో 100కి 100 మార్కులు సాధించింది. ఇక టెన్త్ పత్రాల మూల్యాంకనం కూడా శరవేగంగా పూర్తయ్యింది.
![manaswi](/sites/default/files/images/2024/04/27/manaswi20-1714211665.jpg)
ఈసారి ఎన్నికల సమయం కావడంతో పరీక్షలు కూడా పదిహేనురోజులు ముందే జరిగిపోయాయి.ఫలితాలు కూడా ముందే విడుదల అయ్యాయి. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాలల చివరి పని దినానికి ముందు రోజున పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఇలా చాలా విషయాల్లో ఈసారి టెన్త్ ఫలితాల్లో ఎన్నో రికార్డులు చోటు చేసుకున్నాయి.
Tags
- ap 10th class results 2024 link
- AP Tenth Class Results 2024 News
- ap 10th results on 2024 april 22th
- ap 10th results on 2024 april 22th news telugu
- ap 10th results on 2024 april 22th details in telugu
- AP 10th Class Results News
- ap 10th results 2024
- AP 10th Class Results
- How to Check AP 10th Class Results 2024
- AP 10th Class Results 2024
- ap 10th class results 2024 telugu news
- ap 10th class results 2024 latest news telugu
- ap 10th class results 2024 sakshi education
- AP 10th Class Results 2024 Live Updates