AP 10th Exams Results 2024: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఈసారి ఉత్తీర్ణత శాతం..!

ఆంధ్ర ప్రదేశ్‌ పదో తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఏపీ టెన్త్‌ విద్యార్థుల బోర్డు పరీక్షల ఫ‌లితాలు విడుద‌లైయ్యాయి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. నేడు విద్యార్థుల ఫ‌లితాలను విడుద‌ల చేసిన విద్యా శాఖ కమిషనర్‌ మాట్లాడుతూ.. ఈసారి, మొత్తం 6.3 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయగా అందులో బాలికల్లో 89.17 మంది ఉత్తీర్ణులైతే, బాలురు 84.32 మంది ఉత్తీర్ణులున్నారు. 5 లక్షల 36 వేల మంది విద్యార్థులు పాస్‌.. ఈసారి టెన్త్‌ పరీక్ష ఫలితాల్లో 84.69 శాతం ఉత్తీర్ణత..

AP 10th Class Results 2024 Released: పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి..

ఈ సంవ‌త్స‌రం ఏపీ టెన్త్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులంద‌రికీ నా అభినంద‌న‌లు. ఈసారి 84.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారు. ఈసారి పరీక్షల్లో బాలికలదే పైచేయి. విద్యార్థులంతా వారి జీవితాల్లో ఇంకా ముందుకు న‌డిచి మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌ని ఆశిస్తున్నానని తెలిపారు.

AP SSC Results 2024: నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన విద్య‌ర్థులే కాని, లేదా అనుకున్న మార్కులు సాధించ‌లేక‌పోయిన విద్యార్థులు ఏమాత్రం దిగుచెంద‌కండి. ఏమాత్రం త‌ప్పుడు నిర్ణ‌యాలు కానీ, త‌ప్పుడు ఆలోచ‌ను కాని, చేయోద్దు. విద్యార్థులు వారి ప‌రీక్ష‌లను తిరిగి రాసే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌తీ ఏటా నిర్వ‌హించిన‌ట్లు ఈసారి కూడా విద్యార్థులకు రీ ఎగ్జామ్‌, అడ్వ‌న్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఉంటుంది. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే బోర్డు విడుద‌ల చేస్తుంది. 

#Tags