Replacement of Subject Teachers: హైస్కూల్ ప్లస్‌లో సబ్జెక్టు టీచర్ల భర్తీ
సాక్షి ఎడ్యుకేషన్ : జిల్లాలోని హైస్కూల్ ప్లస్‌లో ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డీఈవో ఎల్. చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు.
జీవీఎంసీ పరిధిలోని మల్కాపురంలో గణితం, ఫిజిక్స్, జువాలజీ అదేవిధంగా జెడ్పీ మేనేజ్‌మెంట్ పరిధిలోని కూండ్రంలో కెమిస్ట్రీ, గోపాలపట్నంలో గణితం, కెమిస్ట్రీ, పాయకరావుపేటలో కెమిస్ట్రీ, సివిక్స్, రాంపురంలో గణితం సబ్జెక్టుల బోధనకు టీచర్లు అవసరం ఉందన్నారు. ఆయా మేనేజ్‌మెంట్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ (సంబంధిత సబ్జెక్టు)లు ఇందుకు అర్హులన్నారు.
ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈ నెల 26న విద్యార్హత, సర్వీసు పరమైన ధ్రువీకరణ పత్రాలతో నేరుగా విశాఖలోని డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అర్హత గల వారికి వెంటనే నియామక ఉత్తర్వులు అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
#Tags