Skip to main content

Online Evaluation: మూల్యాంక‌నం స‌మ‌యంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..

సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం పకడ్బందీగా నిర్వర్తించాలని డీవీఈఓ సయ్యద్‌ మౌలా ఆదేశించారు..
Inter Advanced Supplementary Exams  Online evaluation of intermediate advanced supplementary exam  Online evaluation of Inter Advanced Supplementary Exams

చిత్తూరు: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రక్రియను అధ్యాపకులు పకడ్బందీగా నిర్వర్తించాలని డీవీఈఓ సయ్యద్‌ మౌలా ఆదేశించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇంటర్‌ బోర్డు చరిత్రలో తొలిసారిగా ఆన్‌లైన్‌ మూల్యాంకనం చేపడుతున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర అధికారులు రెండు విడతలుగా అధ్యాపకులకు వర్చువల్‌ శిక్షణ ఇచ్చారని తెలిపారు. మూల్యాంకనం విధులు కేటాయించిన అధ్యాపకులు తప్పనిసరిగా హాజరయ్యేలా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Medical College: ద్వితీయ సంవత్సరానికి అనుమతి

ప్రైవేట్‌ కళాశాలల అధ్యాపకులు హాజరయ్యేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని చెప్పారు. ప్రైవేట్‌ అధ్యాపకులు గైర్హాజరైతే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లో జవాబుపత్రాలు ఓపెన్‌ కావన్నారు. ఇంటర్‌నెట్‌ సెంటర్లలో వ్యాల్యూయేషన్‌ చేయకూడదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ల్యాప్‌ట్యాప్‌, కళాశాలల్లో వెబ్‌ కెమెరా సదుపాయం ఉన్న డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లో మాత్రమే జవాబు పత్రాలను ఓపెన్‌ చేసుకోవాలని సూచించారు.

University Rankings: అత్యుత్తమమైన వర్సిటీల్లో టాప్‌ 300లో ఏయూ..

మూల్యాంకన సమయంలో సంబంధిత అధ్యాపకుడు తప్ప ఇతరులెవ్వరూ కనిపించకూడదన్నారు. ఆ సమయంలో ఫొటోలు తీయకూడదని, వీడియో రికార్డ్‌ చేయకూడదని కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

New Govt Engineering College: ఇంజినీరింగ్‌ వైపు అడుగులు

Published date : 30 May 2024 11:32AM

Photo Stories