Youtube: లో టెన్త్ ప్రీ ఫైనల్‌ ప్రశ్నపత్రాలు

Youtube: లో టెన్త్ ప్రీ ఫైనల్‌ ప్రశ్నపత్రాలు

పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్ష పత్రాలను చట్ట విరుద్ధంగా పరీక్షకు ముందే యూ ట్యూబ్‌లో పెడుతున్న అనుమానితుడి వివరాలను విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కనిపెట్టారని, అతడిపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమానితుడు కడపకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉమ్మడి ప్రశ్న పత్రం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రశ్న పత్రాలను సమయానికంటే ముందుగా బహిర్గతం చేయడం, లేదా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం పరీక్ష నిర్వహణ చట్టాలకు విరుద్ధమని హెచ్చరించారు. ఈ మేరకు విద్యాశాఖాధికారులు కడప పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

#Tags