Self Assessment Test: సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు తేదీలు ఇవే..

గుడివాడ టౌన్‌: ఆగ‌స్టు 27వ తేదీ నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ మోడల్‌ పేపర్‌–1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీ షేక్‌ జానీ సాహెబ్‌ ఆగ‌స్టు 25న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష విధానంలో జరిగిన మార్పులను ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు గమనించాలని పేర్కొన్నారు. 1 నుంచి 8 తరగతులకు సీబీఏ పద్ధతిలో ఓఎమ్‌ఆర్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. 9, 10 తరగతులకు సాధారణ విధానంలోనే పరీక్షలు ఉంటాయని చెప్పారు.

చదవండి: TDP Alliance: నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరీక్ష పత్రాలు ఉంటాయని ప్రైవేట్‌ పాఠశాలలు పరీక్ష పత్రాలను వారే తయారు చేసుకోవాలన్నారు. అయితే పరీక్షల నిర్వహణ మాత్రం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సూంన తేదీల్లోనే జరగాలన్నారు.

ప్రశ్నాపత్రాలు జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నుంచి నేరుగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి వస్తాయని తెలిపారు. పేపర్‌లు లీక్‌ అవడం గానీ, సెల్‌ఫోన్‌ ద్వారా పంపడం గానీ జరిగితే అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

#Tags