10th Class Exams 2024: కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

10th Class Exams 2024: కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి

బాన్సువాడ: విద్యార్థులు ఒక లక్ష్యంతో పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బాన్సువాడలోని సరస్వతి ఫంక్షన్‌ హాల్‌లో షెడ్యూల్‌ కులాల, వెనకబడిన తరగతులు, గిరిజన అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో వసతి గృహాల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు సోమవారం అవగాహన తరగతులను నిర్వహించారు. ఈ ప్రేరణ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Also Read : Telangana 10th Class Study Material

పదో తరగతి పరీక్షల సమయం దగ్గర పడుతుందని, ప్రతీ రోజు ప్రణాళికలు వేసుకుని సబ్జెక్టుల వారీగా చదువుకోవాలని సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, ప్రతీ సబ్జెక్టుపై దృష్టి సారించాలన్నారు. ఉపా ధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్‌ కులాల జిల్లా అధికారి రజిత, వెనుక బడిన తరగతుల వెల్ఫేర్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌, గిరిజన అభివృద్ది సంస్థ జిల్లా అధికారి శ్రీనివాస్‌రెడ్డి, వసతి గృహాల వార్డెన్లు శివగంగ, యాదగిరి, గంగసుధ, విజయశాంతి తదితరులు ఉన్నారు.

#Tags