Tenth Class Public Exams 2024: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు
Tenth Class Public Exams 2024: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు

నరసరావుపేట : జిల్లాలో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ జిల్లాలోని 127 పరీక్ష కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లకు జంబ్లింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఆయా కేంద్రాలలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులను మరో పాఠశాలలో ఇన్విజిలేటర్లుగా నియమించినట్టు చెప్పారు. వీరితో పాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌లను కూడా జంబ్లింగ్‌ చేసినట్టు వివరించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పరిశీలిస్తున్నారని తెలిపారు.

విద్యార్థు లు ప్రశాంతంగా పరీ క్షలు రాసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయటంతోపాటు వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా త్రాగునీటి వసతి కల్పిస్తూ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు వివ రించారు. పరీక్షల్లో భాగంగా నిన్నటి వరకు లాంగ్వేజ్‌ పేపర్లు పరీక్షలు జరగగా, శుక్రవారం నుంచి ప్రధాన సబ్జెక్ట్‌ల పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్షకు పల్నాడు జిల్లా పరిధిలో 27,627 మంది విద్యార్థులకు గాను 26,624 మంది హాజరయ్యారు.

#Tags