Model Foundation School: మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ఎంపికకు పరిశీలన

లేపాక్షి: జిల్లాలో మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ఎంపికకు లేపాక్షి మండలం మండలంలోని నాయనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను రాష్ట్ర బృందం ఫిబ్ర‌వ‌రి 16న‌ పరిశీలించింది.

బృందంలో ప్రథమ్‌ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సూరిబాబు, డిస్ట్రిక్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాసులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌లను ఎంపిక చేయాల్సి ఉండగా రూరల్‌ ఏరియా విభాగం నుంచి జిల్లాలోని ఓ పాఠశాలను ఎంపిక చేయనున్నారు.

చదవండి: Model United Nation: ఎస్‌ఆర్‌ వర్శిటీలో ‘మోడల్‌ యునైటెడ్‌ నేషన్‌’

ఈ నేపథ్యంలో నాయనిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను పరిశీలించినట్లు ఎంఈఓ నాగరాజు తెలిపారు. వారి వెంట సమగ్ర శిక్ష జిల్లా విద్య విషయాక పర్యవేక్షణ అధికారి మహేంద్రరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి–2 కుళ్లాయప్ప, ప్రధానోపాధ్యాయుడు ఇలియాజ్‌, పాఠశాల సిబ్బంది, ఐసీడీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

#Tags