NCERT: 8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

సాక్షి, అమరావతి: ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ బోర్డు తగ్గించింది.
8వ తరగతి సిలబస్‌ తగ్గింపు.. తొలగించిన‌ చాప్టర్లు ఇవే

ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌లలోని కొన్ని చాప్టర్లను పాక్షికంగా కుదించింది. మరికొన్నింటిని పూర్తిగా తొలగించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఎన్సీఈఆర్టీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఎన్సీఈఆర్టీ సిలబస్‌ ప్రకారం బోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తగ్గించిన సిలబస్‌ వివరాలను జూన్‌ 29న ఉపాధ్యాయులకు పంపించారు. ఇంగ్లిష్‌ హనీడ్యూలోని 3, 7 చాప్టర్లలో పోయమ్స్‌తో పాటు 9, 10 చాప్టర్లను పూర్తిగా తొలగించారు.

చదవండి: ‘పీఎం శ్రీ’కి ఐదు పాఠశాలలు

మ్యాథ్స్‌లో ఒకటి నుంచి 16 చాప్టర్లలో.. ఒక్కో చాప్టర్‌లో కొన్ని భాగాలను తొలగించారు. సైన్స్‌(పీఎస్‌–బీఎస్‌)లో కొన్ని చాప్టర్లను పూర్తిగా తొలగించారు. సోషల్‌–రిసోర్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో మూడో చాప్టర్, 5వచాప్టర్‌లోని కొన్ని అంశాలను తొలగించారు. సోషల్‌ అండ్‌ పొలిటికల్‌ లైఫ్‌–3లో 1, 3, 4, 5, 7, 8 చాప్టర్లను పాక్షికంగా, 6వ చాప్టర్‌ను పూర్తిగా తీసివేశారు. సోషల్‌–అవర్‌ పాస్ట్‌–3లో 2 నుంచి 10 వరకు చాప్టర్లను తొలగించారు.

చదవండి: School Education Department: ఉపాధ్యాయుల పదోన్నతులకు ఉత్తర్వులు

#Tags