Tenth Class Public Exams 2024: పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
Tenth Class Public Exams 2024: పదవతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు

ఏలూరు(మెట్రో): జిల్లాలో వచ్చేనెల 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమ వారం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించా రు. పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ జరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల్లోకి చీఫ్‌ సూపరింటెండెంట్‌ తప్ప వి ద్యార్థులతో పాటు టీచర్లు కూడా సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని నిర్ణయించామన్నారు. జిల్లాలో 139 పరీక్షా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ అనుమంతించబోమన్నారు.

Also Read: Model Papers 2024

32,355 మంది విద్యార్థులు : జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం పరీక్షల నివేదికను కలెక్టర్‌కు నివేదించారు. జిల్లాలో మొత్తం 32,355 మంది హాజరుకానున్నారని, వీరిలో 16,760 మంది బాలురు, 15,595 మంది బాలికలు ఉన్నారన్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 24,125 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 8,230 ఉన్నారన్నారు. 139 మంది చొప్పున చీఫ్‌ సూపరిండెంటెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించామన్నారు. ఇన్విజిలేటర్ల నియామక ప్రక్రియ జరుగుతుందన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతా యని, విద్యార్థులను ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. ఆలస్యంగా వచ్చే వారికి అనుమతి లేదని స్పష్టం చేశారు.

#Tags