AP Tenth Class Supplementary Hall Ticket 2024 : ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 హాల్‌టికెట్లు విడుదల.. హాల్‌టికెట్లలను డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఈ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహింనున్నారు. ఈ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..
విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, తమ పేరు, పుట్టిన తేదీ వివరాలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
☛ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు-2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
☛ పదో తరగతి ఓపెన్ స్కూల్ సొసైటీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
ఫస్ట్ లాంగ్వేజ్ 24–05–24
సెకండ్ లాంగ్వేజ్ 25–05–24
థర్డ్ లాంగ్వేజ్ 27–05–24
మాథమెటిక్స్ 28–05–24
ఫిజికల్ సైన్స్ 29–05–24
బయోలాజికల్ సైన్స్ 30–05–24
సోషల్ స్టడీస్ 31–05–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్–1 01–06–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్–2 03–06–24