AP 10th Class Results 2024 Released: పదో తరగతి ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో ఇలా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి..

AP 10th Class Results 2024 Released

AP 10th Class Results 2024 Live Updates :

► ఓవరాల్‌ పాస్‌ పర్సంటేజ్‌- 86.69%
► పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

► పార్వతీపురం జిల్లాలో అత్యధిక ఉత్తీర్ణత శాతం- 96.37%
► కర్నూల్‌ జిల్లాలో అత్యల్స ఉత్తీర్ణత- 62. 47%
► ఈసారి రికార్డు స్థాయిలో మూల్యూంకనం పూర్తి

► బాలికల ఉత్తీర్ణత శాతం- 89.17%
► బాలురు ఉత్తీర్ణత శాతం-  84.21%

►2300 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత
►ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు- 17

►69.26శాతం మంది విద్యార్థులు ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌
►మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు


ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేశారు. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు.

మొత్తం 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు.  గతేడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మే 6న విడుదలయ్యాయి. ఈసారి ఎన్నికల సమయం కావడంతో పరీక్షలు కూడా పదిహేనురోజులు ముందే జరిగిపోయాయి.ఫలితాలు కూడా ముందే విడుదల అయ్యాయి. 

సాక్షి వెబ్‌సైట్‌లో.. 
పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితా.లను విద్యార్థులకు ఒక్క క్లిక్‌దూరంలో విద్యార్థులకు సాక్షి అందుబాటులోకి తెస్తోంది.  www. sakshieducation. com  వెబ్‌సైట్‌ ద్వారా వేగంగా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

#Tags