CSIR-UGC NET Notification: సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. అధ్యాపక వృత్తి, పీహెచ్‌డీలో ప్రవేశానికి మార్గం!

సైన్స్‌ రంగంలో బోధన, పరిశోధనలకు మార్గం.. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌! ఈ పరీక్షలో ప్రతిభ చూపితే.. జేఆర్‌ఎఫ్, పీహెచ్‌డీలో ప్రవేశంతో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి అర్హత లభిస్తుంది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇంతటి ప్రాధాన్యం కలిగిన సీఎస్‌ఐఆర్‌ నెట్‌ను ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌ల్లో నిర్వహిస్తారు. ఇటీవల సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌–2024 జూన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ గైడెన్స్‌... 

సీఎస్‌ఐఆర్, యూజీసీ నెట్‌ను సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌), యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీలు) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. పరీక్ష మాత్రం ఎన్‌ఏటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సైన్స్‌ రంగంలో పరిశోధనలు, బోధన రంగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌.

Government Schools and Colleges: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లవైపు మొగ్గు చూపుతున్న‌ విద్యార్థులు..!

అయిదు విభాగాలు
సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ను మొత్తం అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. కెమికల్‌ సైన్సెస్‌; ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌; లైఫ్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్‌. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) పొందేందుకు అర్హత లభిస్తుంది. అంతేకాకుండా సైన్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీలో చేరొచ్చు. అదే విధంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అధ్యాపక వృత్తిలో అడుగు పెట్టేందుకు అర్హత లభిస్తుంది. 

అర్హతలు

  •     కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌–ఎంఎస్, నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/ఎంబీబీఎస్, బీఎస్సీ ఆనర్స్‌ ఉత్తీర్ణత ఉండాలి. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. 
  •     రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు ఆయా కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. పీహెచ్‌డీలో ప్రవేశం కేటగిరీకి దరఖాస్తు చేసుకున్న వారు నెట్‌ ఫలితాలు వచ్చిన ఏడాదిలోపు పీజీ పూర్తి చేసుకోవాలి.

UG Admissions: నిమ్‌హాన్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు..
 

వయసు

  •     జేఆర్‌ఎఫ్‌ అభ్యర్థులకు వయసు 2024, జూన్‌ 1 నాటికి 30ఏళ్లలోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ–ఎన్‌సీఎల్, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్లు సడలింపు ఇస్తారు.
  •     అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌షిప్‌ నియామకం, పీహెచ్‌డీలో ప్రవేశాల కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.


మూడు కేటగిరీలుగా పరీక్ష
సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ను మూడు కేటగిరీలుగా నిర్వహిస్తారు. అవి..

  •     కేటగిరీ–1: అవార్డ్‌ ఆఫ్‌ జేఆర్‌ఎఫ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అపాయింట్‌మెంట్‌.
  •     కేటగిరీ–2: అపాయింట్‌మెంట్‌ యాజ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పీహెచ్‌డీలోకి ప్రవేశం.
  •     కేటగిరీ–3: కేవలం పీహెచ్‌డీలో ప్రవేశం.
  •     అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ అర్హతలు, ఆసక్తికి అనుగుణంగా కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం పరీక్ష పేపర్లను నిర్దేశిస్తారు.


District Judge Posts: తెలంగాణలో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు..

జేఆర్‌ఎఫ్‌తో పీహెచ్‌డీ

  •     కేటగిరీ 1లో ఉత్తీర్ణతతో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైన వారికి పీహెచ్‌డీలో ప్రవేశానికి కూడా అర్హత లభిస్తుంది. వీరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకానికి కూడా అర్హులే. 
  •     కేటగిరీ–2, 3లలో ఉత్తీర్ణత ఆధారంగా ఆయా యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మలిదశలో ఇంటర్వ్యూ, వైవా ఉంటుంది. సీఎస్‌ఐఆర్‌–యూజీసీ–నెట్‌ స్కోర్‌కు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ స్కోర్‌కు 30 శాతం వెయిటేజీ కల్పించి.. పీహెచ్‌డీ ప్రవేశాలు ఖరారు చేస్తారు.


జేఆర్‌ఎఫ్‌కు ఎంపిక

  •     సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌లో విజయం సాధించి నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లు లేదా రీసెర్చ్‌ లేబొరేటరీల్లో పరిశోధనల దిశగా ప్రవేశం పొందిన అభ్యర్థులకు రెండేళ్లపాటు నెలకు రూ.37 వేలు చొప్పున జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌), రెండేళ్లపాటు ప్రతి ఏటా రూ.20 వేల చొ­ప్పున కాంటింజెంట్‌ గ్రాంట్‌ కూడా లభిస్తుంది.
  •     రెండేళ్ల తర్వాత పీహెచ్‌డీకి నమోదు చేసుకుంటే.. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)గా పరిగణిస్తూ నెలకు రూ.42 వేలు చొప్పున ఫెలోషిప్‌ లభిస్తుంది. ఇలా గరిష్టంగా మొత్తం అయిదేళ్ల పాటు జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు లభిస్తాయి. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తొలి రెండేళ్లు ఎలాంటి ఫెలోషిప్‌ లభించదు. రెండేళ్లలోపు పీహెచ్‌డీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో పేరు నమోదుకు అర్హత పొందితేనే జేఆర్‌ఎఫ్‌ లభిస్తుంది.

Free Coaching for Group 2 Exam: గ్రూప్‌-2 మెయిన్స్ కోసం ఉచిత శిక్ష‌ణ త‌ర‌గ‌తులు..!
 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ఉత్తీర్ణతతో అధ్యాపక వృత్తిలో చేరే అవకాశం లభిస్తుంది. యూజీసీ నిబంధనల ప్రకారం–ఉన్నత విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలకు సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. వీరికి యూజీసీ నిర్దేశించిన పే స్కేల్‌కు అనుగుణంగా వేతనాలు అందించాల్సి ఉంటుంది.

200 మార్కులకు పరీక్ష
సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్షను మొత్తం అయిదు విభాగా(కెమికల్‌ సైన్సెస్‌; –ఎర్త్, అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్, ఓషియన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌; –లైఫ్‌ సైన్సెస్, –మ్యాథమెటికల్‌ సైన్సెస్, –ఫిజికల్‌ సైన్సెస్‌)ల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష మూడు పార్ట్‌లుగా మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది.

  •     ఇందులో పార్ట్‌ ఏ అందరికీ కామన్‌గా ఉంటుంది. ఇది జనరల్‌ అప్టిట్యూడ్‌ విభాగం. ఇందులో లాజికల్‌ రీజనింగ్, గ్రాఫికల్‌ అనాలసిస్, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్, సిరీస్‌ ఫార్మేషన్, పజిల్స్‌ తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  •     పార్ట్‌ బీలో సంబంధిత సబ్జెక్ట్‌ ఆధారిత ప్రశ్నలు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానం (ఎంసీక్యూస్‌)లో ఉంటాయి. పార్ట్‌ సీ కూడా సదరు సబ్జెక్టు సంబంధిత విభాగమే. ఇందులో అడిగే ప్రశ్నలు అభ్యర్థి సైన్స్‌ కాన్సెప్ట్స్‌ను లోతుగా పరిశీలించేలా ఉంటాయి. 
  •     పరీక్ష మూడు గంటల వ్యవధిలో ఉంటుంది. ప­రీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు.

IGNOU Admissions: ఇగ్నోలో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..
 

ముఖ్య సమాచారం

  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, మే 21
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: 2024, మే 25, 26, 27.
  •     సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ తేదీలు: 2024, జూన్‌ 25, 26, 27.
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://csirnet.nta.nic.in/, www.nta.ac.in

 Inter Advanced Supplementary: ఈనెల 24 నుంచి ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు..

బెస్ట్‌ స్కోర్‌కు ఇలా
పార్ట్‌–ఎ (జనరల్‌ ఆప్టిట్యూడ్‌)

అయిదు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడి విభా­గం జనరల్‌ ఆప్టిట్యూడ్‌. ఇందులో స్కోర్‌ సాధించేందుకు తార్కిక విశ్లేషణ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, పజిల్స్‌ తదితర అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా బేసిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌/కరెంట్‌ అఫైర్స్‌ అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

పార్ట్‌–బి
ఈ విభాగంలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇవి పూర్తిగా మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. అభ్యర్థులు తమ అకడమిక్‌ స్థాయి పుస్తకాలను పూర్తిగా అధ్యయనం చేయడం, అన్వయ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఇందులో మంచి మార్కులు పొందొచ్చు.

పార్ట్‌–సి
ఇందులోనూ అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌ సంబంధిత ప్రశ్నలే ఉంటాయి. వీటి క్లిష్టత స్థాయి అధికంగా ఉంటుంది. అభ్యర్థుల్లోని శాస్త్రీయ భావనలపై అవగాహన, శాస్త్రీయ భావనలను అన్వయించే నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి.

పీజీ స్థాయి పుస్తకాలు
సీఎస్‌ఐఆర్‌–యూజీసీ నెట్‌ అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లలో పీజీ స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ సాగించాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం దిశగా ఉపయోగపడే పరిశోధనలపై అవగాహన పెంచుకుంటే.. పార్ట్‌–సిలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది. అధ్యయనం చేసేటప్పుడే రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ అలవర్చుకోవడం లాభిస్తుంది. పార్ట్‌–ఎలో అడిగే జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి కూడా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తాజా పరిశోధనలు , వాటి ఫలితాలు, సంబంధిత శాస్త్రవేత్తల గురించి అవగాహన పొందాలి. 

#Tags