UGC NET 2024: సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ 2024 నోటిఫికేషన్ విడుదల..
» సబ్జెక్ట్లు: కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
» అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/బీఈ/బీటెక్/బీఫార్మసీ/ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
» వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 2024 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ట వయోసడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ /పీహెచ్డీలో ప్రవేశాలకు ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
» పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.
TS EAMCET 2024: టీఎస్ ఇంజనీరింగ్ సెట్ పరీక్ష.. ఎక్కువ ప్రశ్నలు ఆ చాప్టర్ల నుంచే..
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.05.2024.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.05.2024
» ఫీజు చెల్లింపు చివరితేది: 23.05.2024.
» దరఖాస్తు సవరణ తేదీలు: 25.05.2024 నుంచి 27.05.2024 వరకు.
» పరీక్షల తేదీలు: 25.06.2024, 26.06.2024, 27.06.2024.
» వెబ్సైట్: https://csirnet.nta.ac.in
Job Offer: ఏపీ ఎమ్ఎస్ఆర్బీలో ఒప్పంద ప్రాతిపదికన ట్యూటర్ పోస్టులు..