Twin Sisters Success Stories : ఈ ట్విన్‌ సిస్టర్స్‌.. ఒకే ప‌రీక్ష‌లో ఆల్ ఇండియా టాపర్స్‌.. కానీ ఈ కుటుంబం అంతా కూడా..

ఈ ట్విన్‌ సిస్టర్స్‌కి పరీక్షలంటే వారికి భ‌యమే లేదు.. వీరి ప‌రీక్ష‌లు అంటే పండగతో సమానం. దేశంలో అత్యంత క‌ఠిన‌మైన ప‌రీక్ష‌ల్లో సీఏ ప‌రీక్ష‌లు టాప్‌లో ఉంటుంది. ఇలాంటి కఠినమైన పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ రకమైన సపోర్టింగ్‌ సిస్టమ్‌ అవసరం.

కానీ ఇవేవి వీళ్ల‌కు అవ‌స‌రం లేదు. ఎంత‌టి ప‌రీక్ష‌లైన అవ‌లీల‌గా ఉత్తీర్ణత సాధించ‌డం వీరి నైజం. వీరే ముంబైకి చెందిన ట్విన్స్‌ సంస్కృతి, శ్రుతి. ఈ నేప‌థ్యంలో ట్విన్స్‌ సంస్కృతి, శ్రుతి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

ఆ ఇష్టమే వారిని ఎప్పుడూ..

చార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ (సీఏ) ఫైనల్‌ ఎగ్జామినేషన్‌లో ఇరవై రెండు సంవత్సరాల ముంబై ట్విన్స్‌ సంస్కృతి, శ్రుతి ఆల్‌–ఇండియా టాప్‌ టెన్‌ ర్యాంకుల జాబితాలో చోటు సాధించారు. సంస్కృతి రెండో ర్యాంక్, శ్రుతి ఎనిమిదో ర్యాంకు సాధించింది. పరీక్షలు వస్తున్నాయంటే సాధారణంగా చాలామందిలో ఉండే భయం ఈ ట్విన్‌ సిస్టర్స్‌లో ఉండేది కాదు. పరీక్షలంటే వారికి పండగతో సమానం. ఆ ఇష్టమే వారిని ఎప్పుడూ విజేతలుగా నలుగురిలో గుర్తింపు తెస్తోంది. 

కుటుంబం అంతా సీఏలే..


ఇద్దరికీ కొరియన్‌ సినిమాలు చూడడం, బ్యాడ్మింటన్‌ ఆడడం అంటే ఇష్టం. ఈ ట్విన్‌ స్టిసర్స్‌ కుటుంబాన్ని ఫ్యామిలీ ఆఫ్‌ సీఏ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నాన్న, అన్నయ్య, వదిన కూడా సీఏ చేశారు. పరీక్షల కోసం నేను శ్రుతి కలిసి చదువుకున్నాం. ఏ డౌట్‌ వచ్చినా నాన్న, అన్నయ్య అందుబాటులో ఉండేవాళ్లు. కఠినమైన ΄ పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ రకమైన సపోర్టింగ్‌ సిస్టమ్‌ అవసరం అంటుంది సంస్కృతి.

☛ Twin Sisters Got Same Marks in 10th and Inter : విచిత్రం అంటే ఇదే ఏమో.. ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఇంట‌ర్‌లో 620/625 ఒకే మార్కులు.. టెన్త్‌లో కూడా..

#Tags