CBSC Results: సీబీఎస్‌సీ ప‌ది, ప‌న్నెండ‌వ త‌రగ‌తుల ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌.. స‌త్తా చాటిన విద్యార్థులు వీరే!

సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాలలో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఉన్న‌త మార్కులు సాధించిన విద్యార్థుల గురించి వివ‌రాలు ఇలా..

విజయనగరం: జాతీయస్థాయి సీబీఎస్‌ఈ సిలబస్‌లో పదవ, పన్నెండవ తరగతుల ఫైనల్‌ పరీక్షా ఫలితాల్లో విజయనగరంలోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. ఈ విష‌యాన్ని విద్యాలయం ప్రిన్సిపాల్‌ దిలీప్‌మోడీ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి ఫలితాలలో ఎంపీ గాయత్రి వసంత 97.4 శాతంతో 487 మార్కులు తెచ్చుకుని ప్రథమస్థానంలో నిలించిందని తెలిపారు.

IIIT Admissions: ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ద‌ర‌ఖాస్తుల విధానం ఇలా..!

సీహెచ్‌.ప్రవల్లిక 467 మార్కుల (93.4 శాతం)తో ద్వితీయ స్థానం, కేవీకేఎన్‌ఎస్‌ఆర్‌శ్రీకర్‌ 465 మార్కుల (93 శాతం) తృతీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. అదేవిధంగా పన్నెండవ తరగతిలో జి.వెంకటగాయత్రి అమృత 456 మార్కుల(91.2 శాతం)తో ప్రథమ స్థానంలో జి.లక్ష్మిసాయి ప్రశాంతి 442 మా ర్కుల (88.4 శాతం)తో ద్వితీయ స్థానంలో, పి.సాయిమహిత లిఖిత 437 మార్కుల(87.4 శాతం)తో తృతీయ స్థానంలో నిలిచారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు, మంచి ఫలితాలను అందించిన అధ్యాపకులను ప్రిన్సిపాల్‌ అభినందించారు.

TS Inter Supply Exam Fee Extended 2024 : ఇంట‌ర్‌ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే...? ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

#Tags