Jobs news: ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Physiotherapist Posts

నెల్లూరు (టౌన్‌): భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు బీపీటీ, ఎంపీటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు పొందాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.

#Tags