Telangana Gurukula jobs Notification Release news: తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Telangana Gurukula jobs

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో మైనారిటీ గురుకుల సంక్షేమ పాఠశాల లేదా కళాశాలలో విధులు నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్ , రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. 

LIC లో ఇంటర్ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు: Click Here

 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ లో వివిధ రకాల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా నుండి విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న పోస్టులు: ఈ నోటిఫికేషన్ ద్వారా PGT (ఇంగ్లీష్, తెలుగు, సోషల్) , JL (తెలుగు, ఎకనామిక్స్, సివిక్స్) , JL (MLT, CGA) , TGT (సైన్స్, తెలుగు, మ్యాథ్స్) , Dy.వార్డెన్ అని వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఇందులో JL-MLT , JL – CGA ఉద్యోగాలకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అభ్యర్థులు అర్హులు. 
మిగతా ఉద్యోగాలకు కుమురం అసిఫాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థులు అర్హులు.

అర్హతలు: క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



మొత్తం ఖాళీల సంఖ్య: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ఫీజు: ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.. 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 14-09-2024 నుండి ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.

అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు సెప్టెంబర్ 19వ తేదీ లోపు తమ అప్లికేషన్ అందజేయాలి.

అప్లికేషన్ విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా తో పాటు విద్యార్హత సర్టిఫికెట్స్ , రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. 

పరీక్ష విధానం: అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. 

ఎంపిక విధానం: ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి వారి విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: శ్రీ విజయలక్ష్మి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, కే. బి సినిమా టాకీస్ పక్కన, జనక్ పూర్ (గ్రామం) , కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా.

#Tags