Teacher jobs: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Teacher jobs

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సంగి రమేష్‌ పేర్కొన్నారు. కళాశాలలో తెలుగు, ఇంగ్లిష్‌, కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో బోధించేందుకు పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు.

పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ, ఎస్‌ఈటీ, బోధన అను భవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్య ర్థులు ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4గంటల లోపు కళాశాలలోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. వివరాలకు 94404 47737 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

#Tags