Mega Job Mela For Freshers: ఈనెల 28న మెగా జాబ్‌మేళా

job mela

తుమ్మపాల: ఈనెల 28న పాయకరావుపేటలో మెగా జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన సంస్థ, సీడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న జాబ్‌ ఫెయిర్‌ పోస్టర్‌ను సోమవారం కలెక్టరేట్‌లో ఆమె విడుదల చేశారు. సుమారు 50 కంపెనీలు హాజరై సుమారు 2 వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.

10వ తరగతి అర్హతతో కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల జీతం నెలకు 61000: Click here

10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లమో, ఐటీఐ కోర్సులలో ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి శ్రీప్రకాష్‌ డిగ్రీ కాలేజీలో జరిగే జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చునని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్‌.గోవిందరావు చెప్పారు.

ఆసక్తి గల వారు naipunyam. ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని, అడ్మిట్‌ కార్డు, ఆధార్‌, అర్హత సర్టిఫికెట్ల జెరాక్స్‌లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 7893799420, 9492429425, 9010793492 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

#Tags