Latest jobs news: 10th Class పాసైతే చాలు.. ఉద్యోగాలు నెలకు 27వేల వేతనం..

latest jobs news

డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన వీడియో కెమెరామెన్‌, ఫొటోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ఈనెల 21లోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ప్రియాంక ఆల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

2024 మార్చి 31 వరకు పనిచేయాల్సి ఉంటుందని, నెలకు రూ. 27,130 వేతనం ఇస్తామని పేర్కొన్నారు. వీడియో గ్రాఫర్‌ పోస్టుకు డిప్లొమా ఇన్‌ ఫొటోగ్రఫీ, తెలంగాణ లేదా అంధ్రప్రదేశ్‌ స్టేట్‌బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా సాంకేతిక విద్య, శిక్షణ పొందిన అభ్యర్థులు, యూనివర్సిటీ, తత్సమాన విద్యార్హత సాధించిన వారు అర్హులని తెలిపారు.

ఫొటోగ్రాఫర్‌కు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రముఖ స్టుడియోలో ఐదేళ్లు పనిచేసినట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని వివరించారు.

#Tags