Latest Job mela News: 27న పాలిటెక్నిక్‌ కాలేజీలో జాబ్‌ మేళా

Job mela

తిరుపతి ఎడ్యుకేషన్‌ : స్థానిక కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై.ద్వారకనాఽథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌, సీడీఎఫ్‌, డీఆర్‌డీఏ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ISROలో ఉద్యోగాలు ఈ అర్హతతో ఉంటే చాలు: Click Here

ఈ జాబ్‌ మేళాలో శ్రీసిటీలోని బహుళ జాతీయ కంపెనీలైన డైకిన్‌ ఎయిర్‌ కండిషనర్‌, ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, శ్రీరామ్‌ చిట్స్‌, ఎస్‌బీబీ మెడికేర్‌ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు ఆయా సంస్థల ప్రతినిధులతో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. పది, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌ తదితర డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్‌ మేళాలో పా ల్గొనవచ్చని తెలిపారు.

గుడ్‌న్యూస్‌ భారీగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు: Click Here

జాబ్‌ మేళాకు హాజరయ్యే వారు ఆధార్‌కార్డు జిరాక్స్‌, విద్యార్హత సర్టిఫికెట్లు జిరాక్స్‌ కాపీలు, బయోడేటాను రిజిస్ట్రేషన్‌ లింకు అయిన ‘‘హెచ్‌టీటీపీఎస్‌://ఎస్‌హెచ్‌ఓఆర్‌టీయూఆర్‌ఎల్‌.ఏటీ/క్యూజెడ్‌ఆర్‌ఎక్స్‌జె’’ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుని, అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకుని వెంట తీసుకురావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 81435 76866 నంబరులో సంప్రదించాలని ప్రిన్సిపల్‌ కోరారు.

#Tags