Latest Admissions: ఐఐహెచ్‌టీలో స్పాట్‌ అడ్మిషన్లు

Latest Admissions

గుర్ల: రాష్ట్రంలోని తిరుపతి జిల్లా వెంకటగిరిలో ని శ్రీ ప్రగడ కోటయ్య మెమోరియల్‌ ఇండియ న్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యండ్‌ లూమ్‌ టెక్నాలజీలో ఐఐహెచ్‌టీకి స్పాట్‌ అడ్మిషన్లు చేపడుతున్నట్లు జిల్లా చేనేత, జౌళిశాఖ ఎ.డి మురళికృష్ణ ఆదివారం తెలిపారు.

ఈనెల 20న స్పాట్‌ అడ్మిషన్లు చేపడుతున్నట్లు, పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనునట్లు చెప్పారు. ఈకోర్సులో మొదటి ఏడాది పూర్తయిన వారు బీటెక్‌ రెండవ ఏడాదిలో ప్రవేశించడానికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్‌ 9441795408, 9866169908, 9010243054 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

#Tags