Gurukula School jobs: గురుకుల పాఠశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Gurukula School jobs

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పో స్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆపీసర్‌ మందరాణి మంగళవారం తెలిపారు.

నోటిపికేషన్‌లో జేఎల్‌(ఫిజిక్స్‌)01 (ఎస్సీ మహిళ), జేఎల్‌ (కెమిస్ట్రీ)01 (ఎస్సీ మహిళ), పీజీటీ, సోషియల్‌ స్టడీస్‌–01 (ఎస్సీ, మహిళ), అర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ టీచర్‌ 01 (ఓసీ, పీహెచ్‌సీ మహిళ) పోస్టులను తాత్కాలిక ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

జేఎల్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో సెకండ్‌ క్లాస్‌ మార్కులతో ఉత్తీర్ణత, బీఈడీలో 50 శాతం మార్కు లతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉందన్నారు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ పోస్టుకు 10వ తరగతి పాసై, ఆర్ట్‌ కో ర్సులో డిప్లొమో హయ్యర్‌ గ్రేడ్‌ డ్రాయింగ్‌ టీచర్‌ సర్టిఫికేట్‌, సంబంధిత ట్రేడ్‌ జారీచేసిన ఐటీఐ ట్రేడ్‌ సర్టిపికేట్‌ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

అభ్యర్థులు ఇంగ్లిస్‌ మీడియం చదివి ఉండాలని, ఏపీ టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలని సూచించా రు. దరఖాస్తులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న గిరిజన గురుకుల విద్యాలయాల్లో లభిస్తాయని తెలి పారు. అభ్యర్థులు ఈనెల 22వ తేదీ లోపు రేణిగుంట గిరిజన గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమ ర్పించాలని సూచించారు. ఈనెల 30న అదే పాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

#Tags