Group1 Topper: గ్రూప్‌ –1లో మెరిసిన గిరిజన బిడ్డ

Group1 Topper

పుట్టపర్తి టౌన్‌: బుక్కపట్నం మండలం నారసింపల్లి తండాకు చెందిన గుండావత్‌ శివకుమార్‌నాయక్‌ గ్రూప్‌–1 అధికారిగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన చెన్నకేశవనాయక్‌, నారాయణమ్మలకు మూడో సంతానంగా జన్మించిన ఆయన.. అదే గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. పదో తరగతిని పెనుకొండలో పూర్తి చేశారు. పేదరికంలో మగ్గుతూనే డీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ పట్టభద్రుడయ్యారు. చదువులు పూర్తి కాగానే రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే గ్రూప్స్‌కు సిద్ధమవుతూ వచ్చారు. ఈ క్రమంలో గ్రూప్‌ –1 పరీక్షల్లో సత్తా చాటి అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టుకు ఎంపికయ్యారు.

#Tags