Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉట్నూర్‌రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ఎన్‌ఎస్‌ఐసీ హైదరాబాద్ ఎల్‌జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమి ఆధ్వర్యంలో గ్యాస్ చార్జింగ్, ఎయిర్ కండీషనర్ ఇన్ట్సాలేషన్, వాటర్ ప్యూరిఫైయర్ నిర్వహణ, మరమ్మతులు, తదితర విభాగాల్లో ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
MA తెలుగులో స్పాట్ అడ్మిషన్లు: Click Here
శిక్షణ అనంతరం రూ.15 వేల నుండి 20 వేల వేతనంతో కూడిన ఉపాధి కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16 నుంచి 25 వరకు ఉట్నూర్ ఐటీడీఏలోని గిరిజన శిక్షణ ఉపాధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 62816 67501 నంబరులో సంప్రదించాలన్నారు.
#Tags