Forest Department jobs news: అటవీ శాఖలో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసారు. 19+2, Any డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఎలా ఎంపిక చేస్తారు:
10+2, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లు లేవు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారికి ఎటువంటి TA, DA లు ఉండవు.
Clerk Jobs in Government Offices: Click Here
ఉండవలసిన అర్హతలు ఇవే:
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10+2 సైన్స్ విభాగంలో 1st డివిజన్ లో ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వ్యవసాయ విభాగంలో BSC డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు వ్యవసాయ విభాగం లో MSC పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు Apply చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాలు వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹17,000/- శాలరీతో పాటు అలవెన్స్లు కూడా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹19,000/- శాలరీతో పాటు అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో ఉద్యోగాలకు ₹24,000/- శాలరీతో పాటు అలవెన్స్ లు కూడా చెల్లిస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పోస్టులను అనుసరించి 10+2, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు సబ్మిట్ చెయ్యాలి
అప్లికేషన్ దరఖాస్తు ఫారం హార్డ్ కాపీ
ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా Online లో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి.