Free Training: ఉచిత టెక్నికల్‌ శిక్షణతో ఉద్యోగావ‌కాశాలు..

అర్హ‌త, ఆస‌క్తి ఉన్న యువ‌కులు ఈ శిక్ష‌ణ పొందిన అనంత‌రం ఉద్యోగ అవ‌కాశాల‌ను పొంద‌వ‌చ్చు..

అనంతపురం: అనంతపురం ఉప్పరపల్లి రోడ్డులో ఆర్డీటీ స్టేడియం ఎదురుగా ఉన్న ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌లో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వీ.మల్లా రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. అమరరాజా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో రెండు సంవత్సరాల ఉచిత టెక్నికల్‌ శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. పదో తరగతి పాస్‌, ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌, ఐటీఐ పాస్‌/ ఫెయిల్‌ (ఏ ట్రేడ్‌ అయినా) ఉద్యోగ మేళాకు అర్హులు.

AP Tenth Supplementary: ఈనెల 24న ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప్రారంభం.. షెడ్యూల్ ఇలా!

16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువత మేళాలో పాల్గొనవచ్చు. శిక్షణ సమయంలో స్టైఫండ్‌ ఉంటుంది. మొదటి మూడు నెలలు రూ.7,500, తరువాత 9 నెలలు రూ.11,453, చివరి 12 నెలలు రూ.11,653 చెల్లిస్తారు. యువతీ,యువకులకు వేర్వేరు హాస్టల్‌ వసతి కల్పిస్తారు. శిక్షణానంతరం సర్టిఫికెట్‌ అందజేస్తారు. ఆసక్తి గల వారు తమ రెజ్యూమ్‌ లేదా బయోడేటాతో ఈ నెల 23న జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన
ఫోన్‌ నంబర్లు: 90000 24919, 91004 77371, 77807 52418.

TS TET 2024: ఇంగ్లిష్‌ కఠినం..సైన్స్‌ మధ్యస్థం

#Tags