Free training in fabric painting: మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ

Free training in fabric painting

కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలకు మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫాబ్రిక్‌ పెయింటింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ బి.శివప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

30 రోజుల శిక్షణకు 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు చదవడం, రాయడం వచ్చిన మహిళలు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు.

ఆసక్తి కలిగిన మహిళలు మరిన్ని వివరాలకు 63044 91236 నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

#Tags