Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth

విజయనగరం అర్బన్‌: నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణ తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వసతి గృహంలో నిర్వహించనున్నారు. కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌, హౌస్‌ వైరింగ్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ అండ్‌ సర్వీసెస్‌ వంటి కోర్సుల్లో 30 రోజులు శిక్షణ ఇస్తారు.

వసతి, భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు. తెలుపుకార్డు కలిగిన 45 ఏళ్లలోపు వయస్సుగల గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 1వ తేదీలోగా దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని సంస్థ డైరె క్టర్‌ రమణ (99595 21662) కోరారు.

#Tags