Foreign Jobs News: విదేశీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Foreign Jobs News

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్లాస్టరింగ్‌ వర్క్‌, సిరామిక్‌ వర్క్‌, బిల్డింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌, ఐరన్‌ బెండింగ్‌ వంటి రంగాల్లో ఇజ్రాయిల్‌ దేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు గురువారం తెలిపారు.

ఉద్యోగాలకు 8 తరగతి, అంతకంటే ఎక్కువ చదివిన వారు, ఇంగ్ల్లిష్‌పై అవగాహనను విద్యార్హతలుగా వెల్లడించారు. వయస్సు 21 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండి, మూడు సంవత్సరాలు అనుభవం కలిగిన వారు అర్హులన్నారు.

ఆసక్తి గలవారు సంబంధిత వెబ్‌సైట్ల ద్వారా రిజి స్ట్రేషన్లు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99888 53335, 85559 01198 నంబర్లలో సంప్రదించాలన్నారు.

#Tags