Anganwadi News: అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవి ఉచితం..

Anganwadi

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కేంద్రాలకు ప్రథమ చికిత్స కిట్లను పంపిణీ చేసింది. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రథమ చికిత్స చేయడానికి వీలుగా ఈ మెడికల్‌ కిట్లను సరఫరా చేసింది. వీటిలో ఏడు రకాల మందులు ఉంచింది.

టీడీపీ హయాంలో అంగన్‌ వాడీ కేంద్రాలు అధ్వానంగా ఉండేవి. పౌష్టికాహారం పంపిణీ అంతంత మాత్రంగానే ఉండేది. కానీ వైఎస్సార్‌ సీపీ వచ్చాక అంగన్‌వాడీ కేంద్రాల తీరు మారింది. పిల్లలకు రక్షిత నీరు అందించేందుకు ప్రత్యేకమైన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు.

పౌష్టికాహారం పక్కదోవ పట్టకుండా లబ్ధిదారులకు అందించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు వచ్చే పిల్లల ఆటపాటలకు, అక్షరాల బోధనకు తగిన చర్యలు తీసుకున్నా రు. తాజాగా ప్రభుత్వం మంచి ఉద్దేశంతో మెడికల్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను జిల్లాలో ఉన్న 3358 అంగన్‌ కేంద్రాలకు పంపిణీ చేసింది.

చిన్నారులకు స్వల్ప అనారోగ్యం, చిన్న చిన్న గాయాలకు తక్షణ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది.

కిట్‌లో ఏడు రకాల మందులు..

అంగన్‌వాడీ మెడికల్‌ కిట్‌లో పారాసిట్‌మాల్‌ సిరప్‌, ప్రామైసిటిన్‌ ఆయింట్‌మెంట్‌, అబ్జార్టెంట్‌ కాటన్‌, సిఫ్రోప్లాక్సిన్‌ చుక్కల మందు, పోవిడిన్‌ అయోడిన్‌, ఓఆర్‌ఎస్‌, రోలర్‌ బ్యాండేజ్‌లతో పాటు ఐరన్‌ ట్యాబ్లెట్లు, ఫురాజోలిడిన్‌, హ్యాండ్‌ శానిటైజర్‌, నియోమైసన్‌ ఆయింట్‌మెంట్‌, కాటన్‌, బెంజయిల్‌, బెంజోయేట్‌ తదితర మందులు ఉంటాయి. వీటిలో ఏయే మందులు ఎలా ఉపయోగించాలో సమాచా రం కూడా పంపించారు. వీటి వినియోగంపై అంగన్‌ వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు.

మందుల వినియోగం..

జ్వరం: పారాసిటమాల్‌ సిరప్‌ను రెండు నెలల లోపు పిల్లలకు ఒక మిల్లీలీటర్‌ చొప్పున రోజుకు రెండు సార్లు, ఏడాది లోపు పిల్లలకు ఐదు మిల్లీమీటర్లు చొప్పున ఇవ్వాలి.

తెగిన, గీరుకొనే గాయాలు అయితే: ప్రామైసిటిన్‌ స్కిన్‌ క్రీమ్‌ ఆయింట్‌మెంట్‌ను గాయమైన చోట నీటితో శుభ్రంగా కడిగి రాయాలి. అవసరమైతే దూది(కాటన్‌) పెట్టి కట్టు కట్టాలి.

కళ్లు ఎర్రబడటం: సిఫ్రోఫ్లాక్సాసిస్‌ చుక్కల మందును 2 చుక్కలు చొప్పున కళ్లల్లో రోజుకు రెండు నుంచి మూడు సార్లు వాడాలి. చెవి పోటు ఉన్నా ఇలానే చెవిలో చుక్కలు వేయాలి.

డీహైడ్రేషన్‌ అవ్వకుండా : ఓరల్‌ రీ హైడ్రేషన్‌ సాల్ట్స్‌ రెండేళ్ల లోపు పిల్లలకు 50 నుంచి 100 మిల్లీ లీటర్లు, రెండు నుంచి పదేళ్లలోపు పిల్లలకు 100 నుంచి 200 మిల్లీ మీటర్లు చొప్పున ఇవ్వాలి.

కేంద్రాలన్నింటికీ మెడికల్‌ కిట్లు

కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని కేంద్రాలకు ప్రాథమిక మెడికల్‌ కిట్లు పంపిణీ చేశాం. అలాగే వేయింగ్‌ మిషన్లు (నాలుగు రకాలు) కార్యకర్తలకు, ఆయాలకు యూనిఫారమ్‌(ఆరు చీరలు) ప్రీ స్కూల్‌ కిట్‌ (ఆటలు ద్వారా విద్య నేర్చుకొనే వస్తువులు) పంపిణీ చేశారు. ప్రస్తుతం అంగన్‌ వాడీ కేంద్రాల్లో సమృద్ధిగా పరికరాలు ఉన్నాయి.

#Tags